TTD News | జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు
TTD News | జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు
ఆ రోజుల్లో అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు
టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి
Hyderabad : తిరుమలలోని (Tirumala Tirupati Devasthanam) శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకుని వచ్చే ఏడాది అంటే 2025 జనవరి 10నుండి 19వ తేదీ వరకు పది రోజుల పాటు శ్రీవారి వైకుంఠ దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు టీటీడీ కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ పాలక మండలి పలు నిర్ణయాలు తీసుకుంది. అయితే ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని సహకరించాల్సిందిగా తిరుమలకు వచ్చేభక్తులకు టీటీడీకి విజ్ఞప్తి చేస్తుంది.
* వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ తీసుకున్న నిర్ణయాలు..
-శ్రీవారి దర్శన టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు. కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు.
- చిన్నపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, రక్షణ శాఖ, ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు చేస్తారు
- ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు అవుతాయి
-భారీ క్యూలైన్లు నివారించి గరిష్ట సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు.
- గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు. దర్శన టోకెన్లు/ టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు.
- భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూ లైన్ల వద్దకు చేరుకోవాలని సూచన.
- మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్ లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతి లేదు. జనవరి 11 నుండి 19వ తేది వరకు వీరిని దర్శనాలకు అనుమతిస్తారు.
- 3వేల మంది యువ శ్రీవారి సేవకులను, అవసరమైన మేరకు యువ స్కౌట్స్ & గైడ్స్ ను నియమించుకుని వారి సేవలను క్యూలైన్ల నిర్వహణకు వినియోగించుకోవడానికి పరిమితం చేస్తారు.
* * *
Leave A Comment